విశాఖపట్నం జీవీఎంసీ పరిధి 41 వ వార్డు ఉన్న పలు సమస్యలపై మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ.. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ కి వినత పత్రం అందజేశారు. మంగళవారం ఉదయం ఆయన ఛాంబర్ లో కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వీధి దీపాలు వెలగకపోవడంతో వృద్ధులు, మహిళలు పాదాచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సుబ్బలక్ష్మి నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న డ్రైయిన్ పూడిక వలన వర్షాకాలంలో పొంగి రోడ్డు మీదకి ప్రవహిస్తుందని అన్నారు. ఆ పూడికలు వెంటనే తొలగించాలని కోరారు. అలాగే కుక్కల బెడద ఎక్కువగా ఉన్న కారణంగా నియంత్రణ చర్యలు చేపట్టాలని వినతిలో పేర్కొన్నారు. వాటిలో సానిటేషన్ మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జీవీఎంసీ కమిషనర్ కు వివరించారు. కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

previous post