విశాఖపట్నం ప్రముఖ సంఘ సేవకులు కంచర్ల. రాంప్రసాద్ , కంచర్ల .అన్నపూర్ణమ్మ వివేకానంద సంస్థ వారు నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాలకు, 5 సంవత్సరాల క్రితం ఒక ఆటోను బహుకరించారు. ఆ ఆటో కొన్ని మరమ్మతులకు గురైంది, తిరిగి ఆ ఆటో రిపేర్ చేయించి సంస్థ వారికి అందించారు. వారు బహుకరించిన ఆటోలో కరోనా టైంలో ప్రతిరోజు అన్నార్తులకు భోజనాలను అందించడం, ప్రతిరోజు గోషా హాస్పిటల్ లో పేషంట్ల సహాయకులకు భోజనాలు అందించడం, సంస్థ ఆశ్రమ వాసులను సినిమాలకు, బీచ్ లకు తీసుకుని వెళ్లడం, సంస్థకు కావలసిన నిత్య అవసరాలను తీసుకురావడం మొదలైన సేవా కార్యక్రమాలను ఈ ఆటో ద్వారానే నిర్వహిస్తున్నారు. అన్ని రకాలుగా సంస్థకు సహాయ సహకారాలు అందిస్తున్న కంచర్ల . సుగుణ కుటుంబ సభ్యులకు,కె .ఆర్ . బ్రహ్మం అండ్ సన్స్ వారి సంస్థకు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు.

next post