Tv424x7
Andhrapradesh

గంజాయి చాక్లెట్లు 133 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

విశాఖపట్నం విక్రయిస్తున్న పాన్ షాప్ నిర్వాహకుడి అరెస్టు గంజాయిని విక్రయించేందుకు అక్రమార్కులు అనేకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. చిన్నచిన్న ప్యాకెట్లు, లిక్విడ్ గంజాయి రూపం లో ఇప్పటిదాకా అమ్మకాలు జరిపేవారు. తాజాగా చాక్లెట్ల రూపంలో విక్రయి స్తుండగా గుర్తించిన పోలీసులు ఓ పాన్ షాప్ నిర్వాహకుడిని ఆదివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. నగరంలోని క్రాంతిథియేటర్ ఎదురుగా మనోజ్ కుమార్ చౌదరి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. దుకాణంలో గంజాయితో తయారుచేసిన చాక్లెట్లను రహస్యం గా విక్రయిస్తున్నాడు. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఆదివారం టూటౌన్ పోలీసులతో కలిసి దుకాణంపై దాడిచేశారు. ఈ సందర్భంగా అమ్మకానికి సిద్ధంగా ఉంచి 133 గంజాయి చాకెట్లు (660 గ్రాములు) లభ్యమయ్యాయి. చాకెట్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు.

Related posts

గీతా ప్రచార సాధకులు గీతా గాన గంధర్వ ఎండూరి కృష్ణమూర్తి కి ఘన సన్మానం

TV4-24X7 News

రేపే అసెంబ్లీ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు

TV4-24X7 News

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ..

TV4-24X7 News

Leave a Comment