విశాఖపట్నం శుక్రవారం రాత్రి వన్ టౌన్ పోలీసు స్టేషన్ (లా & ఆర్డర్) ను సందర్శించి, ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., నగరంలో లా & ఆర్డర్ అదుపులో ఉంచుతూ నగరం మొత్తం ప్రశాంతముగా ఉండేలా అన్ని లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ల నందు సిపి ఇన్ స్పెక్షన్ చేపడుతున్న విషయం విధితమే, ఇప్పటికే క్రైమ్ స్టేషన్లను పూర్తిగా ఇన్ స్పెక్షన్ చేసిన సిపి గత రాత్రి ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ నందు ఇన్ స్పెక్షన్ నిర్వహించారు. గత రాత్రి వన్ టౌన్ పోలీసు స్టేషన్ (లా & ఆర్డర్) పోలీసు స్టేషన్ ను సందర్శించిన సిపి అధికారులు, సిబ్బంది విధులను సమీక్షించి, స్టేషన్ పరిధిలో గల సమస్యలు, కేసుల రికార్డులు అన్నీ సక్రమముగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేయడం జరిగినది.

previous post