విశాఖపట్నం 27వార్డు వైసిపి అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వర రెడ్డి నీ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వివేకానంద హాస్పటల్లో చికిత్స పొందుతున్న నీలాపు సర్వేశ్వర్ రెడ్డిని మంగళవారం ఉదయం వైసీపీ శ్రేణులతో కలిసి పలకరించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరగా కోలుకోవాలని వాసుపల్లి గణేష్కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు, తన వెంట ఉండే నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండటం తన బాధ్యత అన్నారు. అదేవిధంగా వారి కష్టనష్టాలలో ఈ వాసుపల్లి గణేష్ కుమార్ ఎప్పుడు తోడుగా ఉంటాడని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, 31వ అధ్యక్షులు బాపు ఆనంద్, 35వ వార్డు అధ్యక్షులు కనకా రెడ్డి ,దక్షిణ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్, తాడి రవితేజ , బుజ్జి, రామరాజు, ఆకుల శ్యామ్, మరియు తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

previous post