Tv424x7
Telangana

బాలికపై కాజీపేట సీఐ అత్యాచార యత్నం?

వరంగల్ జిల్లా: అక్టోబర్24కంచే సేను మేస్తే అనే చందంగా ఉంది పోలీసుల వ్యవహారం వరంగల్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి బాలిక తో ఓ సీఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లి దండ్రులకు చెప్పడంతో సీఐ బాగోతం కాస్త బయటకు వచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వడ్డేపల్లిలోని పీజీఆర్‌ లేక్‌వ్యూ టవర్స్‌లో ఉంటున్న రవికుమార్‌ కాజీపేట సీఐ గా పనిచేస్తున్నాడు. సీఐ ఉంటున్న ఫ్లోర్‌లోనే నాలుగేళ్ళ బాలిక కుటుంబం నివాసం ఉంటున్నారు. బాలికపై సిఐ రవికుమార్ కన్నేశాడు, ఆమె తల్లిదండ్రులు లేని సమయం చూసి బాలికను తన రూమ్ లోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసినట్టు తెలిసింది, అంతేకాకుండా ఈ విషయము ఎవరికీ చెప్పవద్దని బాలికను బెదిరించాడు, బాధ తట్టుకోలేని బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది,దీంతో బాలిక తల్లిదండ్రులు కాజీపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

ఆ మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

TV4-24X7 News

Rice Price: పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!..

TV4-24X7 News

భూదాన్ పోచంపల్లి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

TV4-24X7 News

Leave a Comment