Tv424x7
National

త్వరలో ప్రారంభం కానున్న శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి

గత ఏడాది శబరిమల యాత్రా సీజన్‌లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వాసవన్ తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ఏడాది శబరిమల యాత్రా సీజన్ లో 13,600 మంది పోలీసులు, 2,500 ఫైర్, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించనున్నారు. అలాగే, టీడీబీ రైల్వే స్టేషన్ల దగ్గర అదనపు పోలీస్ సిబ్బందిని, అటవీ శాఖ 132 సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1500 ఎకో గార్డ్స్ శబరిమలకు వచ్చే భక్తులకు సహాయం చేయనున్నారు. వీటితో పాటు ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కొన్ని రోజుల కిందట పౌర విమానయాన శాఖ రూల్స్ సడలించింది. సెక్యూరిటీ స్కానింగ్ తర్వాత అయ్యప్ప భక్తులు ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించే ఛాన్స్ కల్పించింది.

Related posts

బ్యారికేడ్లు బద్దలుకొట్టుకుని ఢిల్లీవైపు రైతులు-టియర్ గ్యాస్ ప్రయోగం-టెన్షన్

TV4-24X7 News

భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం

TV4-24X7 News

కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్

TV4-24X7 News

Leave a Comment