విశాఖపట్నం జనతా బజార్ మరియు రైతు బజార్ లో ఎమ్మెల్యే , జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు తో కలసి వెళ్లి వ్యాపారులు తో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాపారులు , స్థానిక నేతలు పలు విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తెలిపారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల అవసరాల మేరకు అభివృద్ది చేస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, టీడీపీ, బిజెపి, జన సేన నాయకులు, పార్టీ నేతలు పాల్గొన్నారు అనంతరం 35 వార్డ్ లో వున్న అన్నా క్యాంటీన్ సందర్శించి, అల్పాహార నాణ్యత గూర్చి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాండురంగ పురం లో శ్రీ లలితా హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారం లోకి వచ్చిన నాటి నుండి టూరిజం అభివృద్ధికి కృషి చేస్తుందని సందర్భంగా తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని టూరిజం ప్రాజెక్టులు ప్రభుత్వం చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
