విశాఖపట్నం జీవీఎంసీ 39 వ వార్డుకు చెందిన ఒక పేద వివాహ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త రూ. 5 వేలు లను బహుమతిగా అందజేశారు. గరికిన ధనరాజు అప్పలరాజు దంపతుల ద్వితీయ పుత్రిక దేవి వివాహ వేడుకలకు వాసుపల్లికి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన దేవి వీరబాబు దంపతులను ఆశీర్వచనాలు అందజేస్తూ రూ. 5 వేలు రూపాయలను నగదును సోమవారం ఉదయం ఆశీల మెట్ట కార్యాలయంలో వధువుకు ఇచ్చారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అన్నవరం దేవస్థానంలో ఈ నెల 9వ తేదీన జరగనున్న గరికిన ధనరాజు కుమార్తె వేడుకలుకి ఆహ్వాన పత్రిక అందించారన్నారు. నియోజకవర్గంలో తనని ఒక కుటుంబ సభ్యుడిగా భావించి వారి కష్టసుఖాలలో తాను కూడా భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉందన్నారు. నూతన వధూవరులుగా ఒక్కటి కాబోతున్న దేవి వీరబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దాంపత్య జీవితాన్ని ఆ భగవంతుడు అందించాలని ఆకాంక్షించారు. పేదల పాలిట ఆపద్బాంధవుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన అనేక సంక్షేమ పథకాలు వారిని ఆదుకునేవన్నారు. ఇప్పటికీ వైయస్సార్, వైయస్ జగన్ పేదలకు చేసిన మంచి పనులు వారిని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంచాయన్నారు. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని తన వంతు సాయంగా నియోజకవర్గ ప్రజలకు కష్టసుఖాల్లో తోడు ఉంటున్నానని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో 30 వార్డ్ వైయస్సార్సీపి యువ నాయకుడు తాడి రవితేజ, వలిశెట్టి లక్ష్మి, చింతకాయల వాసు పాల్గొన్నారు.
