విశాఖపట్నం ఆర్కే బీచ్ లో విహార యాత్ర వివేకానంద ఆశ్రమాలు సాయంత్రం వేళ ఆర్కే బీచ్ సమీపంలో రామకృష్ణ మఠం ముందుగా దర్శించుకుని ఆర్కే బీచ్ లో ఒక రెండు గంటలపాటు చక్కగా చల్లని గాలికి విహరించి ఒకరికొకరు కబుర్లు చెప్పుకొని చాలా సంతోషంగా గడిపిన ఆశ్రమ వాసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానంద సంస్థ వారు పలుమార్లు ఇలా బీచ్ కు పార్కులకు దేవాలయానికి తీసుకెళ్లడం వల్ల మాకు పిల్లలు వదిలేశారని ఎవ్వరూ లేరని బాధలు మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటున్నావని సందర్భంగా తెలియజేశారు వివేకానంద సంస్థ అధ్యక్షుడు ఎస్ అప్పారావు మాట్లాడుతూ వారు సంతోషం కోసం వారం ఒక్కసారి వివిధ సందర్భాల్లో బయటికి తీసుకొస్తున్నామని తెలియజేశారు.
