విశాఖపట్నం తమిళనాడులో రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో అరుణాచలేశ్వర స్వామి వారిని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖనగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అరుణాచల దర్శనం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అరుణాచలేశ్వరుని కృప అందరి పైనా వుండాలని అన్నారు. కార్యక్రమంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

previous post