AP Assembly: అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Meetings) కొనసాగుతున్నాయి. ఇవాళ(శనివారం) అయిదో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి..శాసన మండలికి ఇవాళ సెలవు ప్రకటించారు. ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే సంతాప తీర్మానం ప్రశేశపెట్టనున్నారు. బడ్జెట్ 2024 -25 పై డిమాండ్స్, గ్రాంట్స్ పై పలు శాఖల మంత్రులు వివరణ ఇవ్వనున్నారు. ఆర్ అండ్. బీ..ఇండస్ట్రీస్, జల వనరులు, వ్యవసాయం, సివిల్ సప్లై, హౌసింగ్ శాఖల గ్రాంట్స్‌లపై ఆయా శాఖల మంత్రుల వివరణ ఇవ్వనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రంలో ఏపీ టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లపై సభలో సల్ప కాలిక చర్చ జరగనుంది.
