Tv424x7
Andhrapradesh

15 ఎకరాల అటవీ భూమిలో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన పోలీసులు..

పాడేరు: గంజాయి స్మగ్లర్లు బరి తెగించారు. ఏకంగా అటవీశాఖకు చెందిన భూమిలోనే గంజాయి సాగు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మనబంగి పంచాయతీ జడిగూడలో 15 ఎకరాల అటవీ భూమిలో గంజాయి సాగును పోలీసులు గుర్తించారు..జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ సూచనలతో రెవెన్యూ, అటవీశాఖ, పోలీసుల సమన్వయంతో ధ్వంసం చేసి తగులబెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి రవాణా, సాగుపై ఇటీవల పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం ఇచ్చే సాయంతో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..

Related posts

ఎన్నికల హింసపై సిట్.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి: సీఈసీ

TV4-24X7 News

పవన్ ఎఫెక్ట్ – చంద్రబాబు అలర్ట్, కీలక మార్పు..!!

TV4-24X7 News

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో డాక్టర్ జహీర్ అహ్మద్ చీరలు పంపిణీ

TV4-24X7 News

Leave a Comment