Tv424x7
Telangana

మరో ప్రీ లాంచ్ మోసం – బోర్డు తిప్పేసిన భారతి బిల్డర్స్

హైదరాబాద్ లో ఇష్టారీతిన సాగిన ప్రీలాంచ్ రియల్ఎస్టేట్ వ్యాపారాల్లో మోసాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా ప్రీ లాంచ్‌ పేరిట రూ.200 కోట్లు వసూలు చేసి ఇళ్లు కట్టివ్వకుండా మోసం చేసిన సంస్థపై బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియల్‌ సంస్థ యజమాని ఇంటి ఎదుట 450 మందిని బాధితులు ఆందోళన చేశారు.కొంపల్లిలో ఇళ్లు కట్టి ఇస్తామని భారతి బిల్డర్స్‌ ఫైనాన్షియర్‌ సునీల్‌ కుమార్‌ అహుజ ప్రకటనలు ఇచ్చారు. ప్రీ లాంచ్ ఆఫర్‌లో అతి తక్కువకే వస్తాయని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేశారు. దాదాపు 450 మంది నుంచి రూ.200 కోట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికి నాలుగేళ్లు అయింది. ఇళ్లు కట్టివ్వలేదు. డబ్బులు తిరిగివ్వలేదు. అదిగో… ఇదిగో అంటూ నాలుగు సంవత్సరాల నుంచి భారతి బిల్డర్స్‌ వారు తమను తిప్పుతూనే ఉన్నారు.డబ్బులు చెల్లించినప్పుడు అందరికీ చూపించిన భూమి ప్రీ లాంచ్‌లో నగదు చెల్లించిన వారికి చెప్పకుండా తాకట్టు పెట్టేశాడు. బాధితులు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో, అలాగే సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన…ఇప్పటివరకు పోలీసులు ఏలాంటి కేసు నమోదు చేయలేదు. లోటస్‌ పాండ్‌లో సునీల్‌ కుమార్‌ అహుజ నివాసం వద్ద కొంపల్లి వెంచర్‌ బాధితులు ఆందోళన చేపట్టారు. సునీల్ కుమార్ పై తక్షణం కేసులు పెట్టి తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరుతున్నారు.నాలుగేళ్లకిందట ప్రి లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు వసూలు చేశారు. వారిలో అత్యధిక మంది మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి.

Related posts

రాజస్థాన్ కు చెందిన సైబర్‌ నేరస్థుడు అరెస్టు

TV4-24X7 News

రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti Swaroop) కన్నుమూత

TV4-24X7 News

Leave a Comment