Tv424x7
Andhrapradesh

శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు చిలకపేట శివాలయానికి విరాళం

విశాఖపట్నం ప్రతి సంవత్సరం వివేకానంద సంస్థ వారు చిలకపేటలో గల శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి శివాలయానికి కార్తీక మాసంలో 5 వేలు రూపాయలు, మరియు వివేకానంద జయంతోత్సవాలకు 5 వేలు రూపాయలు విరాళాన్ని అందిస్తున్నారు. ఈ విరాళాన్ని దేవాలయం ధర్మకర్త తాతారావు కి అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, ఈ శివాలయంలో గల విగ్రహాన్ని కాశీ పుణ్యక్షేత్రం నుండి తీసుకువచ్చి ప్రతిష్టించారని, ఈ శివాలయం అభివృద్ధి కొరకు వివేకానంద సంస్థ విరాళాన్ని అందిస్తున్నట్లు, అలాగే పలువురు దాతలు ముందుకు వచ్చి ఈ ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సూరాడ. దానియమ్మ, శాంతి, పార్వతి, రామ జనని, సుజాత, ఉమాదేవి, కనకమహాలక్ష్మి, శ్యామల, నూకరత్నం, రామలక్ష్మి, సావిత్రి మొదలైన వారు పాల్గొన్నారు.చిలకపేటలో ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర దేవాలయం. అభివృద్ధికి 5 వేలు రూపాయలు విరాళం.

Related posts

కనకమహాలక్ష్మి ఆలయ ఈఓ గా శోభారాణి బాధ్యతల స్వీకరణ

TV4-24X7 News

విశాఖ మేయర్ పై అవిశ్వాసం – పట్టించుకోని బొత్స !

TV4-24X7 News

ఏపీలో హైకోర్ట్ సంచలన తీర్పు

TV4-24X7 News

Leave a Comment