గూగుల్ సెర్చ్ టాప్‌లో పవన్ కల్యాణ్ గూగుల్‌లో నెటిజన్లు వెతికిన సెలబ్రిటీల జాబితాలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాప్‌లో నిలిచారు. 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ సంస్థ మంగళవారం ప్రచురించింది. దివంగత టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి కూడా చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ‘స్త్రీ 2’, ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’, ‘సలార్’, రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ల కోసం కూడా గూగుల్‌లో సెర్చ్ చేశారు.
