Tv424x7
Andhrapradesh

రాజధానిలో ఆసక్తికర ప్లెక్సీలు.. ఎవరు పెట్టారబ్బా..?

Andhra Pradesh: సోషల్ మీడియా సైకోలకు కళ్లేం వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అసభ్యకర పోస్టులు పెట్టే వారి బెండు తీసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజల గౌరవాన్ని, నైతిక విలువలు కాపాడడమే లక్ష్యంగా.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఆసక్తికర ప్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి…సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య చాలా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. సోషల్ మీడియాను వ్యక్తిగత దూషణలకు, దుష్ప్రచారాలకు, మహిళలను అవమానించడానికి ఉపయోగిస్తున్నారని అధికార ఎన్డీఏ కూటమి తీవ్ర చర్యలకు దిగింది. ప్రభుత్వాలను అస్థిర పరిచే కుట్రలకు కూడా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే సోషల్ మీడియా పోస్టింగ్స్ విషయంలో కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. దీనికి కేంద్ర మంత్రుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది..మరోవైపు ఏపిలో టిడిపి, వైసిపి మధ్య సోషల్ మీడియా పోస్టింగ్స్ విషయంలో మాటల యుద్దం జరుగుతోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టినందుకే తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ వైసిపి నేతలు గగ్గోలు పెడుతున్నారు. అటు అధికార కూటమీ మాత్రం వ్యక్తిగత దూషణలు, విఐపి కుటుంబ సభ్యులను కించపరచడం, ప్రభుత్వంపై , దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటుంది.ఈ క్రమంలోనే రాజధానిలో వెలసిన పెద్ద పెద్ద బ్యానర్లు, ప్లెక్స్‌లపై ఆసక్తి కర చర్చ నడుస్తోంది. చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు కనవద్దు అన్న మూడు కోతుల బొమ్మల గురించి అందరికి తెలిసింది. ఈ మూడు కోతుల బొమ్మను అనేక చోట్ల ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడే అదే బొమ్మను ఉపయోగించి సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దంటూ ఈ ప్లెక్స్‌లను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం అంటూ వెలసిన ప్లెక్స్‌లు అందరిని ఆలోచింప చేస్తున్నాయి. అసత్య ప్రచారాలకు దూషణలకు స్వస్తి పలుకుదాం అంటూ కూడా ఈ ప్లెక్సీల్లో పెట్టారు. అయితే వీటిని ఎవరూ ఏర్పాటు చేశారన్నఅన్న అంశంపై స్పష్టత లేదు.అమరావతి రాజధానిలో పాటు విజయవాడ నగరంలో ఈ ప్లెక్సీలు వెలిశాయి. అయితే ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ముందే ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు స్థానికులు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్లెక్స్‌లు పెట్టి ఉంటాయర్న భావన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా మూడు కోతుల బొమ్మలతో సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దన్న ప్లెక్స్‌లు మాత్రం టాక్ ఆప్ ధి టౌన్‌గా మారాయి.

Related posts

అకౌంట్లలోకి ‘చేయూత’ స్కీమ్ డబ్బులు విడుదల

TV4-24X7 News

శబరిమలలో అగ్నిప్రమాదం

TV4-24X7 News

35 వ వార్డు లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment