Tv424x7
Andhrapradesh

వేధిస్తున్నాడని కొడుకును హత్య చేసిన తండ్రి..

అనకాపల్లి జిల్లా:డిసెంబర్ 29 నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వెంకునాయు డుపేట శివారు లక్ష్మీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును తండ్రి మద్యం మత్తులో హత్య చేసిన ఘటన ఆదివారం ఉదయం కలకలం రేపింది. కొఠారి రమణ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, తన కన్న కొడుకు కొఠారి భాస్కర్ ను సన్నికాలి రాయితో తల మీద కొట్టి హత్య చేశాడు. టౌన్ సిఐ గోవిందరావు తెలిపిన వివరాలు ప్రకారం…. కొఠారి రమణ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య మరణించి చాలా కాలమైంది. ఆయన కి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివా హం జరిగి నర్సీపట్నంలో వేరే దగ్గర కాపురం ఉంటుంది. కుమారుడు భాస్కర్ ఖాళీగా ఉంటూ తండ్రి మీద ఆధారపడి జీవిస్తున్నాడు.అయితే గత కొద్దికాలంగా భాస్కర్ దుబారా ఖర్చు చేస్తున్నాడని తండ్రి కొడు కుల మధ్య కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నా యి. శనివారం సాయంత్రం భాస్కర్ తన మిత్రుడుతో కలిసి బయట మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తిరిగి ఇంట్లో తండ్రితో సహా భాస్కర్ స్నేహితుడితో కలిసి మద్యం సేవించాడు. రాత్రి 10 గంటల సమయం లో మిత్రుడు వెళ్లిపోయిన తర్వాత తండ్రి కొడుకులు మధ్య పెద్ద వాగ్వాదం నడిచింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ జరగడంతో తండ్రి ఆవేశం తో ఇంట్లో ఉన్న రాయితో భాస్కర్ తల మీద కొట్టాడు. దీంతో భాస్కర్ అక్కడక్కడే మరణించాడు. అయితే భాస్కర్ మరణించిన విషయం తెలియని తండ్రి నిద్రపోయాడు. ఇంట్లో తండ్రి కొడుకు మాత్రమే ఉండడంతో ఆదివారం ఉదయం పని మనిషి వచ్చి చూసేంతవరకు విషయం వెలుగులోకి రాలేదు. పనిమనిషి ఇచ్చిన సమాచారంతో నిందితుడు రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

TV4-24X7 News

శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: వైసీపీ ఎంపీ

TV4-24X7 News

Leave a Comment