మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలను నరికి చంపి ఆపై తానూ ఆత్మహత్య
ఇద్దరు పిల్లలను వేట కొడవలితో మట్టుపెట్టిన కన్న తల్లి.. ఆపై ఆరంతస్తుల భవనంపై నుండి దూకి ఆత్మహత్య! అయితే నిన్న గురువారం జరిగిన ఈ దారుణ ఘటనపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి._పిల్లలు ఆశిష్ (7), హర్షిత్ (4)కి శ్వాసకోశ సమస్యలు ఉండటంతో ప్రతి 3, 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయాలి. దీంతో తేజస్విని తనలోతాను మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం.
మెరుగైన వైద్యానికి భర్త సహకరించట్లేదు. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికిరాకుండా పోతోంది. ఏమైనా మాట్లాడితే భర్త కోపంతో కసురుకుంటాడు. నా పరిస్తితి పిల్లల పరిస్తితి మరి దారుణంగా తయారైంది.’ అని సూసైడ్ నోట్ రాసింది._