హైదరాబాద్: ప్రమాణ స్వీకారానికి ముందు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి గుడికి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నారు..అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి రేవంత్ చేరుకోనున్నారు. మార్గమధ్యలో గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించనున్నారు..మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. ఇప్పటికే నాలుగు బస్సులను అధికారులు సిద్ధం చేశారు..

previous post