వరంగల్ జిల్లా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పరకాలలో పీఎస్‌లో గతంలో సిఐగా పనిచేసిన వెంకటరత్నం కొద్దిరోజుల క్రితం అక్కడి నుండి వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు ఇక్కడ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. అయితే స్థానిక మంత్రి అనుచరుడి మెప్పుకోసం కొన్నాళ్లు వాళ్లకు అనుకూ లంగా పని చేసిన ఇతను వాళ్ల ద్వారా ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత కొన్ని విషయాల్లో వారిని తప్పుదారి పట్టించి తన వ్యక్తిగత కార్యక్రమాలతో పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విదంగా ప్రవర్తించారని అతనిపై విమర్శలు ఉన్నాయి. అయితే నగరంలో కొద్ది రోజుల క్రితం హత్యకు గురైన ఓ వైద్యుడి భార్య పట్ల ఇతను అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరిగి నట్టు సమాచారం. అయితే వైద్యుడి హత్యకేసులో అతని భార్యే ప్రధాన నిందితురాలిగా గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రియుడితో కలిసి భార్తను హత్య చేసిందని ప్రియుడితో సహా ఆమెను జైలుకు పంపారు. ఈ క్రమంలో జైల్లో ఖైదీగా ఉన్న వైద్యుడి భార్యను విచారణ పేరుతో మూడురోజుల కస్టడీకి తీసుకున్న సీఐ.. పీఎస్ ఆవరణలోనే ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే కస్టడీ విచారణ తర్వాత ఆమెను జైలుకు తరలించే సమయంలో ఈ విషయం బయటికి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సున్ ప్రీత్ సింగ్ ఘటనపై విచారణ చేపట్టారు.విచారణలో లైంగిక వేధింపులు నిజమని తేలడంతో ఆ సీఐని సీపీ సస్పెండ్ చేశారు.అయితే ఇతనిపై ఇవే కాకుండా మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

previous post