వైసీపీ ప్రభుత్వానికి 151 సీట్లు ఇస్తే ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. చైతన్యం ఉన్న ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలోని 24 బీసీ కులాలను తెలంగాణలో గుర్తించడం లేదని, ఈ విషయంపై అక్కడి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు.
