Tv424x7
Andhrapradesh

కాకినాడ జిజిహెచ్ లో తొలి కరోనా కేసు నమోదు – పరిస్థితి నిలకడగా ఉండగా, అధికారులు అప్రమత్తం

… కోవిడ్ కేసుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జిజిహెచ్)లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కె. గంగవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన సలాది వెంకట్రావు అనే వ్యక్తి జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ద్రాక్షరామం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించగా, అక్కడ నిర్వహించిన ర్యాపిడ్ కోవిడ్ పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అయింది.తర్వాత వెంటనే అతన్ని కాకినాడ జిజిహెచ్ కు తరలించగా, అక్కడి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలో కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలినట్లు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.పి.ఆర్. విఠల్ శనివారం రాత్రి వెల్లడించారు. రోగి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు తెలిపారు.జిల్లాలో ఈ కేసు నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా, సంబంధిత ప్రాంతాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్, శానిటైజేషన్ పనులు ప్రారంభించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలి అని మీడియాకు తెలియజేశారు.

Related posts

నేటితో 69వ వసంతంలోకి ఆధునిక దేవాలయం.. నాగార్జుసాగర్ డ్యాం

TV4-24X7 News

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

TV4-24X7 News

నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

TV4-24X7 News

Leave a Comment