Tv424x7
Andhrapradesh

విశాఖపట్నంమోడీ గారు ఈసారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా? ఏపీసిసి అధ్యక్షురాలు : వై.ఎస్ షర్మిల

మోదీ విశాఖపట్నం వస్తున్నారని.. విభజన హామీలు ఇప్పటికీ అమలు చేయక పోవడంతో ప్రజలు గుండెలు మండిపోతున్నాయని పేర్కొన్నారు. ఏపీకి ప్రధాని మోదీ వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి.. ఆ మాట తప్పారంటూ ఆమె మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ మోసం చేస్తున్నా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడడం లేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం సరికాదని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, పోలవరం ప్రాజెక్ట్, రాజధానిని నిర్మించ వలసింది కేంద్రమేనని ఆమె స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మించాల్సిన బాధ్యత కూడా మోదీదే అన్నారు. రాజధానికి అప్పులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లపై ప్రధాని మోదీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధానికి ఈ సందర్భంగా వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.

Related posts

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దుమారం.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు

TV4-24X7 News

హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక

TV4-24X7 News

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క

TV4-24X7 News

Leave a Comment