ఏ ఒక్క ఓటు చీలకూడదు.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి..వైసీపీ విముక్త అంధ్రప్రదేశ్ కోసం జనసైన్యం అంతా కంకణం కట్టుకుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు..ప్రజల్ని ఎంతగా హింసించారో గమనించాలన్నారు. టీడీపీ, జనసేన కలసి పనిచేయాలన్నారు. గ్రామ గ్రామాన కష్టపడి టీడీపీ , జనసేన నేతలను గెలిపించుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఓటు చీలకూడదన్నారు. ఒక్క ఉద్యోగం వచ్చిందా..? ఒక్క కొత్తపరిశ్రమ వచ్చిందా.. సరదాగా బటన్ నొక్కడం తప్ప ఈ ప్రభుత్వంతో ఒరిగిందేం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ హాయాంలో తొమ్మిది సార్లు పంటలు నష్టపోయారన్నారు. ఇరుపార్టీల నేతలు ఉమ్మడి మేనిపేస్టో తయారుచేస్తామని ఆయన వెల్లడించారు..అవినీతి గూర్చి ఎంత చెప్పినా ప్రజలకు ఎక్కడం లేదని ఆయన అన్నారు. జగన్ బంధువు , మాజీ మంత్రి అవినీతికి పాల్పడ్డానని చెప్పారని.. సీఎం జగన్ కూడా ఎంత అవినీతి చేసారో చెప్పాలన్నారు. ఇసుక , మద్యం కాదు విద్య , పాలవెల్లువలో అవినీతి జరిగిందన్నారు. పాలవెల్లువ పేరుతో మూడులక్షలకు పైగా బర్రెలు కొన్నామని చెప్పారని.. కానీ ఏ శాఖ చూసినా అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. 3, 359కొట్లు పంచాయితీలకు రాకుండా దారి మళ్లించిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు..గ్రామసచివాలయాలు రాజ్యాంగ విరుద్దం అని కాగ్ రిపొర్ట్ ఇచ్చిందన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..” శ్రీకాకుళంలో అద్బుతమైన వనరులు ఉన్నాయి. రిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయరు.? గుజరాత్ ఎందుకు వలస వెల్లాలి. ఇక్కడ నేతలకు పదవులు దేనికి?. రోడ్లు , వంతెనలు కూడా లేవు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక మేనిపేస్టో తీసుకువద్దామని పవన్ అన్నారు.” అని నాదెండ్ల వెల్లడించారు..

previous post