Tv424x7
Andhrapradesh

రూ 400 పెట్రోల్‌ బైక్‌లో కొట్టించాడు – ఊపినా షేక్ అవ్వలేదు – డౌట్ వచ్చి బకెట్‌లోకి తీయగా

నెల్లూరులోని పెట్రోల్ బంకుల్లో మీటర్ల మాయాజాలం వెలుగు చూస్తోంది. 400 రూపాయలకు పెట్రోల్ కొట్టిస్తే అర లీటర్ కూడా రాకపోవడంతో వినియోగదారుడు షాకయ్యాడు. కొట్టిన పెట్రోల్ అదే బంక్‌లో బకెట్‌లోకి తీయగా మోసం బయటపడింది. ఇలాంటి మోసాలపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో కొందరు నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తూ వినియోగదారుల జోబుకు చిల్లు పెడుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ పెట్రోల్ బంకులో *400 రూపాయలకు పెట్రోల్ పట్టిస్తే కనీసం అర లీటరు కూడా రాకపోవడంతో* వాహనదారుడు అవాక్కయ్యారు. నాలుగు వందలకు పెట్రోల్ కొట్టించిన అతను అనుమానంతో బైకును పక్కన నిలిపి పెట్రోల్‌ను బకెట్లోకి తీశాడు. బకెట్లో కనీసం అర లీటర్ పెట్రోల్ కూడా రాకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించగా.. వారు సరైన సమాధానం కూడా చెప్పలేదు. మీటర్లలో మాయాజాలం చేసి దోచుకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మీటర్లను మ్యానిపులేట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలను ఎవరూ పట్టించుకోవడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Related posts

ఏకాదశి సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించిన వివేకానంద ట్యూషన్ విద్యార్థులు

TV4-24X7 News

31 వ వార్డు లో టి.డి.పి సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

ఉరికిటి గణేష్ ఆద్వర్యం లో టి.డి.పి సభ్యత్వం నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment