వైయస్సార్ కడప జిల్లా/యర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలులో నుండి దూకి ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ధర్మవరం వెళ్లేందుకు ప్రొద్దుటూరు నుండి ఓ కుటుంబ ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ రాగ అక్కడ తొందర్లో తల్లి కూతురు మరో రైలు ఎక్కారు ఇది గమనించిన ఆ తండ్రి రైలు దిగాలని కోరగా అప్పటికే వేగాన్ని పుంజుకున్న రైలు నుండి తల్లి మహాలక్ష్మి కూతురు శ్రీదేవి దూకేశారు.దీంతో వేగంగా రైలు నుండి తల్లి కూతురు దూకగా తల్లికి గాయాలు కాగా కుమార్తె అపస్మాతక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇది గమనించిన ఆర్.పి.ఎఫ్ ఏఎస్ఐ సలాం, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు హుటాహుటిన అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి వారికి సపర్యలు చేసి అనంతరం 108 వాహనం లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సకాలంలో స్పందించి వారి ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సలాంకు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు కు బాధిత కుటుంబాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
