Tv424x7
Andhrapradesh

మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

IED Blast | ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బృందాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు..ఈ దాడిలో ఇద్దరు జవాన్లు (CRPF jawans) తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా (Sukma) జిల్లాలోని కిస్టారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల సలాటోంగ్‌ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది..పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బృందాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఐఈడీ పేలుడులో సీఆర్‌పీఎఫ్‌లోని కోబ్రాకు చెందిన ఇద్దరు కమాండోలకు తీవ్ర గాయాలయ్యాయి. జవాన్లు అక్కడ జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల వద్ద విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లకు శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని విమానంలో ఆసుపత్రికి తరలించారు..

Related posts

పింఛన్ల ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత: ఎన్డీయే కూటమి

TV4-24X7 News

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మరమ్మతులకు నోచని వాహనాలు…

TV4-24X7 News

జగన్ జైలుకు వెళతారు: ఎమ్మెల్యే దగ్గుపాటి

TV4-24X7 News

Leave a Comment