Tv424x7
Andhrapradesh

తుమ్మనంగుట్ట టోల్ ప్లాజా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.

అన్నమయ్య జిల్లా

స్థానిక ప్రజలకు టోల్ గేట్ వద్ద మినహాయింపు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు.

జాతీయ రహదారి 42 తుమ్మనంగుట్ట వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ స్థానిక ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని టోల్ ప్లాజా సిబ్బందిపై వాగ్వాదానికి దిగిన స్థానిక ప్రజలు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా టోల్ ప్లాజా సిబ్బంది స్థానిక ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చుట్టుపక్కల గ్రామాల వారు టోల్ గేట్ దాటి వెళ్లాల్సి వస్తుందని ప్రతిసారి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా ఉన్న ప్రజలు ఏదైనా ఐడి ప్రూఫ్ చూపించి టోల్ ప్లాజా ను దాటి వెళ్ళవచ్చని నిబంధనలు ఉన్న నిబంధనలను తుంగలో తొక్కుతున్న టోల్ ప్లాజా సిబ్బంది.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టోల్ ప్లాజా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపిన స్థానిక ప్రజలు.

ములకలచెరువు,బి.కొత్తకోట మండలాలకు సంబంధించిన స్థానిక ప్రజలు అందరూ తుమ్మనం గుట్ట టోల్ ప్లాజా వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని దేశంలో అన్ని చోట్ల స్థానికుల వాహనాలకు మినహాయింపు ఉందని ఇక్కడ కూడా ఇదే ఇదే తరహాలో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్న స్థానిక ప్రజలు…

Related posts

కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

TV4-24X7 News

వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం

TV4-24X7 News

నిలోఫర్‌లో చిన్నారికి కరోనా.. ఆక్సిజన్‌ సాయంతో చికిత్స

TV4-24X7 News

Leave a Comment