Tv424x7
Andhrapradesh

బైపాస్ రోడ్డు పేరుతో వనిపెంటరైతుకుటుంబాల ఉపాధి మీదదెబ్బ కొట్టాలనుకోవడం దారుణం : ఏవి. రమణ

మైదుకూరు టు తాటిచెర్ల 167బి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో వనిపెంట దగ్గర బైపాస్ రోడ్డు పేరుతో పొలాలను తీసుకొని రైతు కుటుంబాలఉపాధి మీద దెబ్బ కొట్టాలనుకునే ప్రయత్నం చేయడం దారుణమని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు. ఈరోజు వనిపెంటలోరైతులతో కలిసి పొలాలను పరిశీలించిన రమణ మాట్లాడుతూ మైదుకూరు నుంచి తాటిచెర్ల వరకు రెండు మూడు కుంట్లున్న గ్రామాలలో, పెద్దపట్టణమైన పోరుమామిళ లోనడిఊర్లో కూడా రోడ్డును తీసుకెళ్తున్న నేషనల్ హైవే అధికారులు ఎటువంటి అబ్జక్షన్ లేనటువంటి ఎక్కువ ప్రభుత్వ స్థలము ఉన్న రోడ్డును వదిలేసి కేవలం ప్రధాన రోడ్డుకు100 మీటర్ల దూరంలో బైపాస్ పేరుతో హై పవర్ విద్యుత్ లైన్, హీందు స్మశాన స్థలం, మైదుకూరు ఎర్ర చెరువుకు నీరు వచ్చేకాలువ పైన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే బైపాసును ఏర్పాటు చేసేందుకు ఎటువంటి పంటైన పండగలపొలాలను రైతుల నుంచి తీసుకోవాలనే ప్రయత్నం మానుకోవాలని ఈ ప్రయత్నాన్ని రైతు సేవా సమితి ఆధ్వర్యంలో రైతులు ,రైతు శ్రేయోభిలాషులతోకలిసి న్యాయ పోరాటంతో పాటు పొలాల్లో ప్రాణాలు ఎదురువడ్డైన అడ్డుకుంటామని రమణ ఈరోజు వనిపెంట రైతులతో పొలాల్లో తెలియజేశారుచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కటారి వీరన్న, రైతు సేవా సమితి నియోజకవర్గ కార్యదర్శి మాడిశెట్టి సహదేవుడు, సమితి మైదుకూరు పట్టణ అధ్యక్షుడు కానగూడూరు రామ్మోహన్, రైతులు రాజశేఖర్ గౌడ్, బూమిరెడ్డి శ్రీనివాసులు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంగవైకల్యం చెందిన మహిళకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన సీఐ విజయలక్ష్మి

TV4-24X7 News

అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

TV4-24X7 News

ఏపీలో ఉచిత సిలిండర్ పథకం పొందాలంటే ఇవి తప్పనిసరి

TV4-24X7 News

Leave a Comment