Tv424x7
Andhrapradesh

జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ..

తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు IPS ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు:

🔹 పరిసరాల పరిశీలన:
పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి, అక్కడ నిల్వలో ఉన్న ద్విచక్ర వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టు అనుమతితో వాహనాల డిస్పోజల్ కు ఆదేశించారు.

🔹 సీసీ కెమెరా తనిఖీ:
మొదటి అంతస్తులోని రూమ్ లో ఉన్న సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించి, రికార్డ్ స్టోరేజ్ గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఫుటేజ్ ని జాగ్రత్తగా భద్రపరచాలని స్పష్టమైన సూచనలు చేశారు.

🔹 డ్రోన్ వాడకంపై దృష్టి:
డ్రోన్ కెమెరా వినియోగం ఎలా జరుగుతోంది అని అడిగి, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్ పహారా కొనసాగించాలని ఆదేశించారు.

🔹 క్రైం చార్ట్, పాత కేసుల సమీక్ష:
స్టేషన్ లోని క్రైం చార్ట్‌ను పరిశీలించి, పాత కేసులపై పురోగతిని కోరారు. కేసుల ఛేదనకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

🔹 రౌడీ షీటర్లపై పట్టు:
స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల సంఖ్య, వారిలో యాక్టివ్‌గా ఉన్నవారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిత్యం నిఘా ఉంచాలని, రాత్రివేళ పర్యవేక్షణ నిర్వహించాలన్నారు.
రౌడీ షీటర్ల పట్ల నిర్లక్ష్యం ఉపేక్షించేది కాదని స్పష్టం చేశారు.

🔹 పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష:
జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను ప్రశ్నించి, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఈ తనిఖీ ద్వారా జిల్లా ఎస్పీ పలు కీలక అంశాలను ప్రాధాన్యతగా పరిగణించి, క్రమశిక్షణ, సాంకేతిక వినియోగం, కేసుల పరిష్కార వేగం, మరియు నేర నియంత్రణపై నిఘా వంటి అంశాల్లో మోటివేషన్ ఇచ్చారు.

Related posts

ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో త్వరలో నంద్యాల – చైన్నై బస్సు సర్వీసు ప్రారంభం

TV4-24X7 News

చనిపోయిన నా తల్లిని కూడా రాజకీయాల్లోకి లాగారు: మోదీ.

TV4-24X7 News

హోం మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్

TV4-24X7 News

Leave a Comment