ఒకే పరికరం మనిషి చుట్టూ ఉన్న అన్ని సాధనాలను మింగేస్తోంది. గడియారం, టార్చ్ లైట్, పోస్టుకార్డు, పుస్తకాలు, రేడియో, టేప్ రికార్డర్, కెమెరా, కాలిక్యులేటర్… ఇవన్నీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో కలిసిపోయాయి.సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతున్న కొద్దీ మానవ సంబంధాలు తగ్గుతున్నాయి. ఇరుగుపొరుగు దోస్తీ, బంధుత్వాలు, వ్యక్తిగత మెమొరీ – అన్నింటినీ ఫోన్ మింగేస్తోంది. “థియేటర్ లేదు, నాటకం లేదు, ఆట లేదు, పాట లేదు…” అన్నట్లుగా వినోదం, వ్యాపారం, ఆహారం, బ్యాంకింగ్, వైద్యం, జ్యోతిష్యం… అన్నీ ఒకే పరికరంలోకి మారిపోయాయి.ప్రస్తుత పరిస్థితి అంతా “వర్క్ ఫ్రమ్ ఫోన్” స్థాయికి చేరింది. ఫోన్ స్మార్ట్ అవుతున్న కొద్దీ, మనిషి మాత్రం పిచ్చివాడవుతున్నాడన్న అభిప్రాయం నిపుణులది. టచ్‌తోనే జీవితం సాగుతున్నా, మనుషులు మాత్రం టచ్‌లో లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.

previous post
next post