దేశంలో నక్సలైట్ల సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లను అంతమొందించే వరకూ మోడీ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదని ఆయన స్పష్టం చేశారు.
అమిత్ షా మాట్లాడుతూ – “నక్సలైట్లు లొంగిపోయి ప్రాణాలను కాపాడుకోవాలా? లేక భద్రతా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోవాలా? అనేది వారే నిర్ణయించుకోవాలి” అని అన్నారు.
దేశ ప్రజల భద్రత, అభివృద్ధి కోసం నక్సలైట్ల మూలం పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
నక్సలైట్ల సమస్యను శాశ్వతంగా అంతం చేసే దిశగా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోందని అమిత్ షా వెల్లడించారు.