Tv424x7
National

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించేందుకు వెళ్తున్న మరో హెలికాప్టర్..

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని సహాయక బృందాలు గుర్తించాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ పేర్కొంది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది.ఆదివారం నాడు హార్డ్ ల్యాండింగ్‌కు గురైన హెలికాప్టర్‌లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉన్నారని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.’ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్న ప్రదేశాన్ని గుర్తించాం. కానీ, పరిస్థితి అంత బాగోలేదు’ అని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థకు ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ హెడ్ చెప్పారు.స్థానిక మీడియా కథనం ప్రకారం, ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదాఫరీన్ అనే రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి బయలుదేరారు. అప్పుడే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది..

Related posts

భారతీయ విస్కీకి ప్రపంచ గౌరవం

TV4-24X7 News

భార్య అందంగా తయారవుతోందని చంపేశాడు!

TV4-24X7 News

ఇలా చేస్తే.. మీ ఆధార్ డేటా సేఫ్.!

TV4-24X7 News

Leave a Comment