తెలంగాణలో విచ్చలవిడిగా రాబోతున్న మైక్రో బ్రూవరీలు
ఇక నుండి హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రదేశాల్లో కూడా బీర్ల అమ్మకాలు.
1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.. దరఖాస్తుకు రూ.1 లక్ష మాత్రమే.
ఇక నుండి తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ బీర్ దొరకబోతుంది.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR)తో పాటు కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలకు అనుమతిచ్చిన ఎక్సైజ్ శాఖ.
TCUR పరిధిలోని జీహెచ్ఎంసీ, బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట్, మీర్ పేట్ పరిధిలో కూడా దరఖాస్తుల స్వీకరణ.
నిబంధనల ప్రకారం ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్ని అనుమతులు ఇస్తామని తెలిపిన ఎక్సైజ్ శాఖ.