కడప జిల్లా, కలసపాడు మండలం:
మహానందిపల్లి, ముద్దంవారిపల్లి గ్రామాల్లో పట్టపగలు ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. ఈ కేసులో కలసపాడు పోలీసులు చర్యలు తీసుకొని ఐదు మంది మహిళలు, ఒక యువకుడుతో కూడిన మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, వీరంతా కలిసి రెండు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇంటి యజమానులు ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఆస్తులు అపహరించారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన ఎస్‌ఐ వారు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది.