బుడితి మద్యం దుకాణంపై టాస్క్ ఫోర్స్ దాడి!
కల్తీ మద్యం తయారీ, విక్రయాలపై అనుమానాలు
సారవకోట మండలం, సెప్టెంబర్ 5:
సారవకోట మండలంలోని బుడితి గ్రామంలో ఉన్న ఓ మద్యం దుకాణంపై మంగళవారం ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా దాడి నిర్వహించారు. కల్తీ మద్యం తయారీ మరియు విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం నేపథ్యంలో ఈ దాడి చేపట్టినట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో భాగంగా, సంబంధిత మద్యం దుకాణ యజమానులు అద్దెకు గది తీసుకుని అక్కడే కల్తీ మద్యం తయారీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ మద్యం స్థానికంగా విక్రయాలు చేయడంతో ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అయితే ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు పాతపట్నం ఎక్సైజ్ శాఖ సిబ్బంది నిరాకరించారు. ఇంకా, పాతపట్నం ఎక్సైజ్ సీఐ కృష్ణారావుకు పలు మార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం గమనార్హం.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలన్నది స్థానికుల అభిప్రాయం.