తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి భూమారాగిణి గనియమితులయ్యారు. అధికారికంగా ఈ నియామక ప్రకటన విడుదల కాగా, అనేక మంది ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
భూమా రాగిణి తాడిపత్రి రాజకీయ రంగంలో సుపరిచితమైన నాయకురాలు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సదుపాయాలు అందించడంపై ఆమె దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఆమె నాయకత్వంలో మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.