పంచాయతీ పరిధిలో బార్ నడపడానికి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినా, వ్యాపారులు మాత్రం ముందుకు రాకపోవడం వార్తగా మారింది.
ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం నెలకు ₹35 లక్షలు నగదు రూపంలో చెల్లించాల్సి ఉండటమే వ్యాపారులు వెనుకడుగు వేయడానికి కారణమని చెబుతున్నారు. భారీ ఆర్థిక భారం భరించలేమంటూ ఎవరూ ముందుకు రావడం లేదు.
దీంతో ఎక్సైజ్ అధికారులు మాత్రం తిప్పలు పడుతున్నారు. టెండర్లలో పాల్గొనే వారే లేకపోవడంతో, ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
👉 స్థానికంగా అయితే, “పీలేరు వంటి పట్టణంలో ఇంత పెద్ద మొత్తం కట్టగల వ్యాపారి లేరు. అందుకే ఎవరూ బిడ్ వేయడం లేదు” అనే అభిప్రాయం వినిపిస్తోంది.