తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు, ముందుకు వెళ్తున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముప్పైమంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మొత్తం బస్సులో నలభై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
గాయపడిన వారిని వెంటనే రూయా ఆసుపత్రికి తరలించారు