ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేగింది.అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.రఘురామకృష్ణరాజు ప్రకారం
➡️ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుంది.
➡️ పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు.
➡️ మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాపై రాజకీయ రచ్చ మొదలైంది.టీడీపీ నేతలు — “వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా రావాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది” అని డిమాండ్ చేస్తున్నారు.రఘురామ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ముసురుకున్నాయి.వైసీపీ తరఫున ఇంకా అధికారిక స్పందన రాలేదు.