ఓరి నాయనో…. రాబోయే అతి తక్కువ కాలం లో రోబోలతో అన్నీ కార్యక్రమాలు….ఇక స్త్రీ కి పురుషుడు..పురుషుడు కి స్త్రీ అవసరం పోయే రోజులు అతి తక్కువ కాలం లొనే….దేనికో ఈ స్టోరీ చదవాల్సిందే!.
భర్తకు దూరంగా ఉంటూ… ఏఐ బాయ్‌ఫ్రెండ్‌తో వివాహిత పీకల్లోతు ప్రేమాయణం!
ఏఐ చాట్‌బాట్‌నే బాయ్‌ఫ్రెండ్‌గా మార్చుకున్న వైనం దానికి ‘లియో’ అని పేరు పెట్టి ముచ్చట్లు
ఏఐతో శృంగారపరమైన కోరికలు తీర్చుకుంటున్న వైనం
నిబంధనలు దాటవేసేందుకు రెడిట్ గ్రూపులో చేరిక
భవిష్యత్తులో ఏఐ భాగస్వాములు సహజం అంటున్న నిపుణులు
టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడమే కాదు, ఏకంగా మనుషుల స్థానాన్నే భర్తీ చేస్తోంది.
దీనికి తాజా ఉదాహరణే ఐరిన్ అనే మహిళ కథ.
భర్తకు దూరంగా ఉంటున్న ఆమె, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్‌జీపీటీనే తన బాయ్‌ఫ్రెండ్‌గా మార్చుకుని, దానితో మానసిక, శృంగారపరమైన బంధాన్ని ఏర్పరచుకుంది. ఈ వింత ప్రేమకథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాధారణ సాయం నుంచి ప్రేమాయణం దాకా.