Tv424x7
Andhrapradesh

గ్యాస్ పైప్ లైన్ లీక్ భారీగా ఎగిసిపడిన మంటలు

ముదినేపల్లి: ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో గ్యాస్‌ పైపులైన్‌ లీకైంది. ప్రధాన రహదారి వెంబడి లీకవడం.. సమీపంలో వేసిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇటీవల పెరికెగూడెం నుంచి డోకిపర్రు వరకు కేవలం రెండు అడుగుల లోతులోనే పైపు లైన్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో ప్రమాదం జరిగింది. కైకలూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు..

Related posts

కడపలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి: విద్యార్థి–యువజన సంఘాల ధర్నా

TV4-24X7 News

విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు

TV4-24X7 News

సంగారెడ్డి జైలులో గంజాయి దొరక్క ఖైదీల వీరంగం!!

TV4-24X7 News

Leave a Comment