Tv424x7
Andhrapradesh

కడపలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి: విద్యార్థి–యువజన సంఘాల ధర్నా

కడప: ఉమ్మడి కడప జిల్లాలో 2023–25 విద్యాసంవత్సరాల ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో భారీ అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆర్‌సీయం డయాసిస్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 29 పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ, అధికారిక ప్రక్రియను పక్కనపెట్టి 24 పోస్టులను ₹13–35 లక్షల విలువలో అమ్మకానికి వేశారు అని విద్యార్థి–యువజన సంఘాలు పేర్కొన్నాయి.

PSYF రాష్ట్ర కన్వీనర్ ఓబులేసు కత్తి, TRSF రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరాజ్, RSA రాష్ట్ర అధ్యక్షుడు బందెల ఓబులేసు లు మాట్లాడుతూ, రోస్టర్ విధానం ఉల్లంఘన, స్థానిక అభ్యర్థుల బదులు నాన్-లోకల్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించడం, BCI కేటగిరీల లోపాలు ప్రధాన అవకతవకలుగా ఉన్నాయి అని తెలిపారు.

విద్యార్థి–యువజన సంఘాలు త్రీమ్యాన్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, అక్రమ నియామకాలను రద్దు చేయాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆర్జెడి కార్యాలయ సూపరింటెండెంట్ సీతారామకృష్ణకు వినతిపత్రం సమర్పించాయి.

ఈ ధర్నాలో PSYF జిల్లా కన్వీనర్ బయన్న, ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సూపర్ సిక్స్ సక్సెస్‌ఫుల్ హిట్.. పండుగ రోజే 82% ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పూర్తి..

TV4-24X7 News

సామాజిక సేవలో ఎస్ జీ ఎస్

TV4-24X7 News

తిరుమ‌లలో.. వెంకటేశ్వర స్వామి సేవ‌లో..ఎంపీ డీకే.అరుణ‌.

TV4-24X7 News

Leave a Comment