విజయనగరం:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పథకం కింద పింఛన్ల పంపిణీ ఘనంగా కొనసాగుతోంది. పండుగ రోజు అయినా ఒకటో తారీఖు ఉదయం ఇంటివద్దకే వెళ్లి ప్రభుత్వ సిబ్బంది పెన్షన్లు అందజేశారు. ఉదయం 11 గంటలకే సుమారు 82 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది.
ఈ సందర్భంగా కొద్దిసేపట్లో విజయనగరం జిల్లాలో జరిగే “పేదల సేవలో” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో స్వయంగా సీఎం పేదలకు పెన్షన్లు అందజేయనున్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని ప్రజలు పండుగలాగా స్వాగతిస్తున్నారని అధికారులు తెలిపారు.

