హైదరాబాద్ : ఈరోజు వెంకట్ రెడ్డి పల్లి ఆర్‌ఎస్‌కేను డీ.ఏ. రవి సందర్శించారు. ఈ సందర్భంగా యూరియా బస్తాలపై తనిఖీలు చేపట్టారు.
రైతులకు అన్యాయంగా ఎరువులు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులు మరియు సిబ్బందికి సూచించారు.
రైతు ఒక్కొక్కరికి రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇవ్వాలని, మొక్కజొన్న మరియు వరి పంటలు వేసిన రైతులకు మాత్రమే మొదటి విడత పంపిణీ చేయాలని డీ.ఏ. రవి ఆదేశాలు జారీ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం, సమయానికి అవసరమైన ఎరువులు అందించడమే తనిఖీల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆంజనేయులు, టెక్నికల్ ఏవో కిరణ్ కుమార్ రెడ్డి, ఏఈఓ విశ్వేశ్వరి పాల్గొన్నారు.