.. శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్- జనవరి మాసాలలో వివిధ తేదీలలో మొత్తంగా 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. వివిధ తేదీలలో రాకపోకలు కొనసాగించే ఆ రైళ్ల నెంబర్లు, తేదీలతో పాటు పలు వివరాలను మంగళవారం ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.