Tv424x7
Andhrapradesh

అది అబద్ధపు ప్రచారం.. రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు: నాగబాబు

NagaBabu: నెల్లూరు: రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని జనసేన నేత నాగబాబు (NagaBabu) స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తాననేది అబద్ధపు ప్రచారమని చెప్పారు. నెల్లూరులో రెండో రోజు జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది..ఇందులో నియోజకవర్గాల వారీగా నాగబాబు సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా నేతల అక్రమ మైనింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు..”అక్రమ మైనింగ్‌పై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షకు సమయం లేక వెళ్లలేదు. నాకు ఏపీ, తెలంగాణలో ఓటు ఉందనేది అసత్యం. హైదరాబాద్‌లో ఓటు ఉంది కానీ, మొన్నటి ఎన్నికల్లో వేయలేదు. మంగళగిరికి వచ్చేయడంతో ఓటు మార్చాలని దరఖాస్తు చేశా. వైనాట్‌ 175 అని వైకాపా అంటోంది. మేం వైనాట్‌ వైకాపా జీరో అంటాం. ఏ నాయకుడైనా ప్రతిపక్షం ఉండకూడదనే ఆలోచన చేయకూడదు” అని నాగబాబు అన్నారు..

Related posts

దసరా ఉత్సవాలు రాట ముహర్తం కార్యక్రమం లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

IDBI బ్యాంకులో 119 ఖాళీలు..

TV4-24X7 News

రాజధాని పనులు ప్రారంభం.. మహిళా రైతుల పాదయాత్ర

TV4-24X7 News

Leave a Comment