Tv424x7
Andhrapradesh

కత్తులతో వైకాపా నాయకుల వీరంగం .. ఒకరి మృతి, నలుగురికి గాయాలు

Nellore: కావలి: నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా నాయకులు కత్తులతో వీరంగం సృష్టించారు. ఆస్తి వివాదం నేపథ్యంలో ఐదుగురిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తెదేపా నాయకుడు సురేష్‌ మృతి చెందగా..శ్రీనివాసులు, పవన్‌, సుష్మ, సుబ్బారావుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు..నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు ఆటోనగర్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పుల్లా సుబ్బారెడ్డి, సురేష్‌ కుటుంబాల మధ్య చీటీ పాట డబ్బుల విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బాకీ డబ్బులు చెల్లించాలంటూ సురేష్‌ కుటుంబం.. సుబ్బారెడ్డి కుటంబంపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆగ్రహించిన సుబ్బారెడ్డి తన బంధువైన చలంచర్ల విజయ్‌రెడ్డితో కలిసి సురేష్‌ ఇంటిపై దాడికి వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తులతో సురేష్‌ని పొడవడంతో మృతిచెందాడు. దాడిని అడ్డుకునేందుకు సురేష్‌ ఇంటిలో అద్దెకు ఉండే శ్రీనివాసులు, సుష్మా, సుధాకర్‌ ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కావలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు..

Related posts

తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) లక్ష్మీ ప్రసన్నకి రైతాంగ సమస్యలపై వినతి పత్రం అందించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

TV4-24X7 News

టీటీడీ పాలకమండలి నియామకం.. పునరాలోచనలో సర్కార్

TV4-24X7 News

Leave a Comment