వైఎస్ఆర్ జిల్లా..పెండ్లిమర్రి మండలం…అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ దాడులు- రెండు ట్రిప్పర్లు, ఒక హిటాచీ సీజ్- అక్రమ రవాణాలో చక్రం తిప్పిన అధికారులపై చర్యలేవిపెండ్లిమర్రి మండలంలోని తుమ్మలూరు నుండి గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానిక ప్రజానీకం నుండి తీవ్ర విమర్శలు రావడమే కాకుండా సోషల్ మీడియాలో ఇసుక అక్రమ రవాణాపై భారీ స్థాయిలో ప్రచారం నడిచింది.కొంత ఆలస్యంగానైనా ఎట్టకేలకు స్పందించిన విజిలెన్స్ అధికారులు తాజాగా ఇసుక అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి రెండు టిప్పర్లు, ఒక హిటాచి వాహనాన్ని అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు.వాహనాలు, యంత్రాన్ని మాత్రమే సీజ్ చేశారంటూ గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా వెనుక చక్రం తిప్పిన అధికారులపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇసుక అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలంటే అక్రమాలకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటేనే సాధ్యమవుతుందని పలువురు ప్రజలు కోరుతున్నారు.

previous post